Maharashtra: మద్యం వ్యాపారిని తరిమి తరిమి కొట్టిన మహిళా సర్పంచ్... వీడియో ఇదిగో!
- మహారాష్ట్రలోని పింప్రి డుమారాలో ఘటన
- మద్యం వద్దంటున్నా వినని వ్యాపారి
- పరుగులు పెట్టించిన సర్పంచ్ మనీషా
తమ గ్రామంలో మద్యం అమ్మకాలు చేయవద్దంటున్నా, వినకుండా విక్రయాలు సాగిస్తున్న ఓ వ్యాపారిని, ఆ గ్రామ సర్పంచ్ తరిమి తరిమి కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే, మహారాష్ట్రలోని సిర్పూర్ తాలూకా పింప్రి డుమారా అనే గ్రామంలో మద్యం విక్రయాలు ఇటీవలి కాలంలో పెరిగాయి. ఈ కారణంతో ఊళ్లో గొడవలు పెరిగాయి.
దీన్ని గుర్తించిన సర్పంచ్ మనీషా కేద్కర్, మద్యం అమ్మే వ్యాపారికి బుద్ధి చెప్పాలని భావించింది. అనుకున్న వెంటనే ఓ కర్ర తీసుకుని అతనిపైకి లంఘించింది. మరోసారి గ్రామంలో లిక్కర్ అమ్ముతావా? అంటూ కర్రతో కొట్టింది. దీంతో మరోసారి గ్రామంలో అమ్మకాలు చేయబోనని వేడుకుంటూ అతను పరుగులు పెట్టాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా చూడవచ్చు.