Krishnamraju: ఇమ్యూనిటీ పెంచుకోవడం ఎలా... అర్ధాంగితో కలిసి యోగాసనాలు వేసి చూపించిన కృష్ణంరాజు

Krishnamraju and wife demonstrates Yoga to raise immunity

  • కరోనా నేపథ్యంలో ఇమ్యూనిటీకి ప్రాధాన్యత
  • యోగాలో దీనికోసం ఆసనాలు ఉన్నాయన్న కృష్ణంరాజు
  • కీలక ఆసనాలతో వీడియో విడుదల

కరోనా రక్కసి కరాళనృత్యం చేస్తున్న ప్రస్తుత తరుణంలో అందరి దృష్టి వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం ఎలా అన్నదానిపై పడింది. ప్రముఖ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు దీనిపై స్పందిస్తూ, ఇమ్యూనిటీ పెంచుకునేందుకు యోగాలో అనేక ఆసనాలు ఉన్నాయని తెలిపారు. తన అర్ధాంగి శ్యామలాదేవితో కలిసి పలు ఆసనాలు వేసి చూపించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. రేపు ప్రపంచ యోగా దినోత్సవం కావడంతో కృష్ణంరాజు ఈ వీడియో రూపొందించారు. యోగాతో మనశ్శాంతిగా ఉండడమే కాదని, కరోనా వంటి ప్రమాదకర వైరస్ ల నుంచి రక్షించుకోవడానికి అవసరమైన వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందని వివరించారు. ప్రాణక్రియ, కపాలభాతి అనే యోగా ప్రక్రియలను కృష్ణంరాజు ప్రదర్శించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News