Amalapuram: తూర్పుగోదావరి జిల్లా నగరంలో ఒకేసారి ఐదుగురు ముస్లిం యువకుల అదృశ్యం!

Five youth in Amalapuram town went missing

  • నిన్నటి నుంచి ఆచూకీలేని యువకులు
  • యువకుల కుటుంబాల్లో ఆందోళన
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబసభ్యులు

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో ఐదుగురు ముస్లిం యువకులు అదృశ్యం కావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. వారి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదుగురు యువకులు నిన్నటి నుంచి కనిపించకపోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారంపై వెంటనే స్పందించిన అమలాపురం డీఎస్పీ వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు దీనిపై వివరాలు సేకరిస్తున్నారు.

Amalapuram
Youth
Missing
DSP
Police
  • Loading...

More Telugu News