Bandla Ganesh: బండ్ల గణేశ్ కు కరోనా... అలర్ట్ అయిన టాలీవుడ్!

Bandla Ganesh Gets Corona

  • ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో బండ్ల గణేశ్
  • అపోలో లేదా కాంటినెంటల్ లో చేరనున్నా
  • తనను సంప్రదించిన మీడియాతో బండ్ల

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కు కరోనా సోకడంతో, టాలీవుడ్ అలర్ట్ అయింది. గత రెండు రోజులుగా బండ్ల గణేశ్ కు కరోనా సోకినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తుండగా, తనను సంప్రదించిన మీడియా ప్రతినిధులకు ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అపోలో లేదా కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేరనున్నానని, ప్రస్తుతానికి హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని ఆయన పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇటీవల బండ్ల గణేశ్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ నిమిత్తం వెళ్లగా, అనారోగ్య లక్షణాలను చూసిన అక్కడి డాక్టర్ కరోనా టెస్ట్ కు రిఫర్ చేశారట. ఆ వెంటనే బండ్ల గణేశ్ కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ గా తేలింది.

Bandla Ganesh
Corona Virus
Tollywood
  • Loading...

More Telugu News