India: యుద్ధ విమానాల గర్జనలతో దద్దరిల్లుతున్న గాల్వాన్ లోయ!

Fighter Jets at China Border

  • సరిహద్దులకు భారీ ఎత్తున ఫైటర్ జెట్స్
  • హిందూ మహా సముద్రంలో నౌకాదళం అప్రమత్తం
  • సరిహద్దుల్లో సైన్యాన్ని పెంచుతున్న చైనా

గాల్వాన్ లోయ ఇప్పుడు అత్యాధునిక యుద్ధ విమానాల గర్జనలతో దద్దరిల్లుతోంది. వాయుసేన వద్ద ఉన్న సుఖోయ్-30, ఎంకేఐ, మిరాజ్, జాగ్వార్ లను ఇప్పటికే అవంతి పొర, లేహ్, శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో భారత సైన్యం మోహరించింది. హిందూమహా సముద్రంలో నౌకాదళం అప్రమత్తమైంది. చైనాతో ఉన్న సరిహద్దు సమీపానికి ఫైటర్ జెట్స్ చేరుకుని, ఉద్ధృతంగా గస్తీ తిరుగుతున్నాయి. ఇటీవల అమెరికా సమకూర్చిన అపాచీ హెలికాప్టర్లను కూడా భారత వాయుసేన సరిహద్దులకు చేర్చింది. గాల్వాన్ లోయ ప్రాంతంతో పాటు సిక్కిం, అసోం, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలకు కూడా ఫైటర్ జెట్స్ చేరుకున్నాయి.

ఈ వారం ప్రారంభంలో గాల్వాన్ లోయ వద్ద, చైనా సైనికుల దాడిలో 20 మందికి పైగా భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్యా తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చైనాను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలన్న ప్రధాని ఆదేశాలతో, భారీ ఎత్తున బలగాలను ఆ ప్రాంతానికి తరలించారు. సరిహద్దులకు చేరుకున్న యుద్ధ విమానాలు గస్తీ తిరుగుతున్నాయి.

ఇదే సమయంలో చైనా సైతం సరిహద్దులకు మరింత సైన్యాన్ని యుద్ధ విమానాలను తరలించింది. భారత శిబిరాలకు దాదాపు కిలోమీటర్ దూరంలోనే చైనా సైన్యం మోహరించిందని ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. టిబెట్ లోని ఎంగారి వైమానిక స్థావరం నుంచి చైనా ఫైటర్ జెట్స్, తమ భూ భాగంలో గస్తీ తిరుగుతున్నాయి. చైనా సైన్యానికి పాకిస్థాన్ తనవంతు సహకారాన్ని అందిస్తోంది. అతి త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఉన్న స్కర్డ్ ఎయిర్ ఫోర్స్ బేస్ కూ విమానాలను తరలించాలని చైనా యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News