BPR Vithal: ఆర్థికవేత్త, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీఆర్ విఠల్ కన్నుమూత
- గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విఠల్
- క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్న వైనం
- నేడు ఫిలింనగర్‌లో అంత్యక్రియలు
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ ఆర్థికవేత్త, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీఆర్ విఠల్ (94) నిన్న కన్నుమూశారు. గురువారం ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ తర్వాతి రోజు తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య శేషు విఠల్, కుమారులు సంజయ్ బారు, చైతన్య, కుమర్తె నివేదిత ఉన్నారు. పెద్దకుమారుడైన సంజయ్ బారు ప్రముఖ కాలమిస్టుగా సుపరిచితులు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వద్ద మీడియా సలహాదారుగానూ పనిచేశారు.
నేడు ఫిలింనగర్‌లోని మహాప్రస్థానంలో విఠల్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విఠల్ 1950లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత దాదాపు అన్ని ప్రభుత్వాల్లో కీలక పదవుల్లో ఉండి సేవలు అందించారు. విఠల్ మృతికి ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.