Medak District: లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక.. ఆకలితో అలమటించి మహిళ మృతి!

Hunger death in Telangana

  • మెదక్ జిల్లాలో దాబాలో పాచిపని చేసుకునే మహిళ
  • లాక్‌డౌన్‌తో దాబా మూత
  • చేతిలో డబ్బుల్లేక, తినడానికి తిండి లేక కన్నుమూత

మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఆకలికి తాళలేక ఓ మహిళ మృతి చెందడాన్ని చూసిన వారి గుండెలు తరుక్కుపోతున్నాయి. జిల్లాలోని మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని కలబురిగి పట్టణానికి చెందిన శ్రీదేవి (45) కొన్నేళ్ల క్రితం గ్రామానికి వచ్చి దాబాలో పాచిపని చేస్తూ జీవిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా దాబా మూతపడడంతో ఆమెకు ఉపాధి కరవైంది. చేతిలో డబ్బుల్లేక, తినడానికి తిండిలేక అల్లాడిపోయింది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం దెబ్బతింది. ఆరోగ్యం మరింత క్షీణించడంతో నిన్న తెల్లవారుజామున మృతి చెందింది.

Medak District
Manoharabad
Hunger death
Telangana
  • Loading...

More Telugu News