Budda Venkanna: నువ్వేమన్నా రాజమార్గంలో రాజ్యసభకు వెళ్లావా?: విజయసాయిరెడ్డిపై బుద్ధా విమర్శలు

Buddha fires on Vijayasai Reddy

  • లోకేశ్ దొడ్డిదారిలో ఎమ్మెల్సీ అయ్యారన్న విజయసాయి
  • వెంటనే బదులిచ్చిన బుద్ధా
  • క్రమశిక్షణ అంటే బూతులు తిట్టడమా అంటూ ఆగ్రహం

నారా లోకేశ్ దొడ్డిదారిలో ఎమ్మెల్సీ అయ్యాడంటూ వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. నువ్వేమన్నా రాజమార్గంలో రాజ్యసభకు వెళ్లావా? అంటూ ధ్వజమెత్తారు. లోకేశ్ కు విలువలు తెలియవని, క్రమశిక్షణ లేదని విజయసాయి చేసిన వ్యాఖ్యలకు కూడా బుద్ధా బదులిచ్చారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మైనారిటీ వర్గానికి చెందిన చైర్మన్ పై దాడి చేయడం, బూతులు తిట్టడమా క్రమశిక్షణ అంటే? అవేనా సభ విలువలు? అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని, పెద్దల సభను అవమానించే దుర్మార్గపు సంస్కృతి వైసీపీదేనని విమర్శించారు. నారా లోకేశ్ అసెంబ్లీలోకి అడుగుపెట్టాలో వద్దే నిర్ణయించేది ప్రజలని స్పష్టం చేశారు.

Budda Venkanna
Vijayasai Reddy
Nara Lokesh
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News