Rajya Sabha: రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

Rajya Sabha elections polling begins
  • దేశంలోని 19 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
  • సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
  • అనంతరం ఎన్నికల ఫలితాలు
  • ఆంధ్రప్రదేశ్‌లో 4 స్థానాలకు ఎన్నికలు
దేశంలోని 19 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో 4, గుజరాత్‌లో 4, రాజస్థాన్‌లో 3, మధ్యప్రదేశ్‌లో 3, ఝార్ఖండ్‌లో 2, మణిపూర్‌, మిజోరం, మేఘాలయాల్లో ఒక్కో స్థానానికి  ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి నాలుగు స్థానాలకు వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో పోలింగ్ జరుగుతోంది.

అసెంబ్లీ కమిటీ హాలు-1లో పోలింగ్ బూత్‌ ఏర్పాటు చేశారు. వైసీపీ నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పరిమళ్‌ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ, టీడీపీ నుంచి వర్ల రామయ్య ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే.
Rajya Sabha
elections

More Telugu News