China: గల్వాన్ ప్రాంతం ఎప్పటికీ భారత్‌దే: మహ్మద్ అమిన్ గల్వాన్

Galwan Valley Always Been Indias says Rasool Galwan

  • లార్డ్ డన్మోర్ బృందాన్ని కాపాడినందుకు గుర్తుగా మా తాత పేరు
  • 19వ శతాబ్దం మధ్యలో టిబెట్‌, 1962లో చైనా విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రయత్నించాయి
  • చైనా అప్పుడు, ఇప్పుడు ఒకేలా ప్రవర్తిస్తోంది

భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలకు కారణమైన గల్వాన్ ప్రాంతంపై లడఖ్ కు చెందిన గులామ్ రసూల్ గల్వాన్ మనవడు మహ్మద్ అమిన్ గల్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతం ఎప్పటికీ భారత్‌దేనని స్పష్టం చేసిన ఆయన.. అసలు ఆ ప్రాంతానికి గల్వాన్ అనే పేరు రావడానికి వెనక ఉన్న కథను వివరించారు. 1878లో లేహ్‌లో జన్మించిన తన తాత గులాం రసూల్ గల్వాన్ అప్పట్లో టిబెట్, మధ్య ఆసియా కొండల్లోని కారకోరం కనుమల్లో బ్రిటిష్ పాలకులకు గైడ్‌గా పనిచేసేవారని గుర్తు చేశారు.

తన తాతకు 12 ఏళ్ల వయసున్నప్పుడు ఒకసారి లార్డ్ డన్మోర్ బృందం ఈ ప్రాంతానికి విహారయాత్రకు వచ్చిందని, అయితే, ఆక్సాయిచిన్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా డన్మోర్ బృందం దారి తప్పిందని అన్నారు. వారికి దారి చూపించే క్రమంలో తన తాతయ్య నది ఒడ్డుకు చేరుకుని వేరే మార్గం ద్వారా వారిని తప్పించి కాపాడారని పేర్కొన్నారు. మరణం అంచుల వరకు వెళ్లిన వారిని కాపాడినందుకు గుర్తుగా డన్మోర్ ఈ ప్రాంతానికి ఆయన పేరు పెట్టారని రసూల్ గల్వాన్ వివరించారు.

19వ శతాబ్దం మధ్యలో రష్యా ఒకసారి టిబెట్‌లో విస్తరణ పనులు చేపట్టిందని, అప్పుడు తన తాత బ్రిటిష్ విస్తరణ బృందానికి గైడ్‌గా ఉన్నట్టు చెప్పారు. రష్యా కదలికలపై అంచనా వేసి బ్రిటిష్ బృందానికి ఆయన సరైన దారిచూపడంతో రష్యా ఆటలు సాగలేదని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత 1962 ప్రాంతంలో చైనా ఈ ప్రాంతాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసిందన్నారు. ఈ ప్రాంతం ఎప్పటికీ భారత్‌దేనని ఆయన తేల్చి చెప్పారు. అప్పుడు, ఇప్పుడు చైనీయులు అలానే చేస్తున్నారని, మన సైనికుల త్యాగాలకు జోహార్లు అని రసూల్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News