Andhra Pradesh: ఏపీ, టీఎస్ మధ్య బస్సు సర్వీసులు... కండిషన్ పెట్టిన తెలంగాణ!
- ఏపీ, టీఎస్ మధ్య ఇంకా ప్రారంభంకాని బస్సు సర్వీసులు
- రెండు రాష్ట్రాల బస్సు సర్వీసులు సమానంగా ఉండాలంటున్న తెలంగాణ
- ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య కొనసాగుతున్న చర్చలు
లాక్ డౌన్ ఆంక్షలు క్రమంగా తొలగిపోతున్నాయి. ఇప్పటికే అన్ లాక్ 1.0 అమల్లో ఉంది. త్వరలోనే అన్ లాక్ 2.0 అమల్లోకి రాబోతోంది. ఇప్పటికే రవాణా వ్యవస్థ కూడా పునఃప్రారంభమైంది. వాహనాల రాకపోకలపై తెలంగాణ ఆంక్షలను ఎత్తివేసింది. ఏపీ నుంచి కర్ణాటకకు బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మాత్రం సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. దీనికి సంబంధించి తెలంగాణ అధికారులకు ఏపీ అధికారులు లేఖ రాశారు.
ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులకు తెలంగాణ కూడా సుముఖంగానే ఉంది. అయితే ఒక చిన్న కండిషన్ పెట్టింది. ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు సమాన సంఖ్యలో ఉండాలని కండిషన్ పెట్టింది. ఇదే విషయంపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. దీనిపై క్లారిటీ వచ్చిన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభంకానున్నాయి.