AP Assembly Session: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా... 15 బిల్లులకు ఆమోదం
- ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- ఇవాళ కొత్తగా 11 బిల్లులకు ఆమోదం
- నాలుగు పెండింగ్ బిల్లులకూ మోక్షం
- వీరమరణం పొందిన సైనికులకు నివాళి అర్పించిన సభ
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి! రెండ్రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాలు ఇవాళ నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఈ సమావేశాల్లో మొత్తం 15 బిల్లులకు ఆమోదం లభించింది. వీటిలో కొత్తవి 11 బిల్లులు, పాతవి 4 బిల్లులు ఉన్నాయి.
రెండ్రోజుల పాటు సమావేశాలు అని పేర్కొన్నా, సభ జరిగింది కేవలం 5 గంటల 58 నిమిషాలే! ఇక, రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడమే ఈ సమావేశాల్లో హైలైట్ అని చెప్పాలి. బడ్జెట్ పై సభలో పెద్దగా చర్చ జరగలేదు. సభ వాయిదాకు ముందు సీఎం జగన్ సహా ఇతర సభ్యులు సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ సహా ఇతర సైనికులకు నివాళిగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.