Poonam Kaur: ఓ సినీ దర్శకుడిపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

Poonam Kaur sensational comments on a cine director
  • గతంలో ఆత్మహత్య ఆలోచన చేశానన్న పూనమ్ కౌర్
  • ఓ దర్శకుడ్ని ఓదార్పుగా మాట్లాడాలని కోరినట్టు వెల్లడి
  • కానీ అతడు అవహేళన చేశాడని వివరణ
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలో స్పందిస్తూ, గతంలో తాను కూడా ఆత్మహత్య దిశగా ఆలోచనలు చేశానని వెల్లడించారు. అయితే ఆ దశలో ఓ దర్శకుడ్ని ఓదార్పు వచనాలు మాట్లాడమని అడిగానని తెలిపారు.

"ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది... నా మానసిక ఆరోగ్యం క్షీణించింది. నాతో కాసేపు మాట్లాడండి అని కోరాను. కానీ ఆ దర్శకుడు నాతో సరిగా వ్యవహరించలేదు సరికదా, నువ్వు చనిపోతే ఏం జరుగుతుంది? ఒక రోజు న్యూస్ లో ఉంటావేమో అని అవహేళనగా మాట్లాడాడు. ఆయన మాటలతో నాకు మరింత బాధ కలిగింది. ఆ దర్శకుడు ఎన్నో రంగాలపై ప్రభావం చూపించే వ్యక్తి. అతడి మాటలు నన్ను మరింత బాధించినా... ఆత్మహత్య జోలికి వెళ్లకుండా జీవితంలో నిలబడేందుకు ప్రయత్నించా" అని వివరించారు.

అంతేకాదు, మరో ట్వీట్ లో ఆ దర్శకుడిపై నిప్పులు చెరిగారు. "నువ్వు గురూజీవి కాదు. నీ స్వార్థం కోసం నీ స్నేహితుల్ని కూడా మభ్యపెడుతూ బతుకుతున్నావు. నీ వల్ల ప్రయోజనం పొందినవాళ్లు ఎవరూ లేరు. నువ్వు సైలెంట్ గా నన్ను సినిమాల నుంచి నిషేధించావు. నేనెప్పుడూ నీకు సమస్యలు సృష్టించకపోయినా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నావు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లా మానసిక వేదనకు గురయ్యేలా చేస్తున్నావు. కానీ నేను అతనిలా జీవితాన్ని ముగించాలనుకోవడంలేదు" అంటూ సోషల్ మీడియాలో స్పందించారు.
Poonam Kaur
Director
Comments
Tollywood

More Telugu News