Chiranjeevi: వారి ధైర్యానికి సెల్యూట్: చిరంజీవి

Salute their bravery says Chiranjeevi
  • భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ
  • ప్రాణాలు అర్పించిన సైనికులకు చిరంజీవి నివాళి
  • వారికి బాధను తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకున్న చిరు
భారత్-చైనా బలగాలకు మధ్య లడఖ్ ప్రాంతంలోని సరిహద్దులలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీరులకు జాతి మొత్తం కన్నీటితో అంజలి ఘటిస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవి కూడా ట్విట్టర్ ద్వారా నివాళి అర్పించారు.

'దేశం కోసం ప్రాణత్యాగం చేసిన తెలుగు బిడ్డ సంతోష్ తో పాటు 20 మంది సైనికుల కుటుంబాల కోసం నా హృదయం దుఃఖిస్తోంది. ఇంతటి బాధలో కూడా తమ పిల్లలు దేశం కోసం త్యాగానికి పాల్పడ్డారంటూ వారి తల్లిదండ్రులు చెపుతున్నారు. వారి ధైర్యానికి సెల్యూట్. జవాన్ల కుటుంబాలకు బాధను తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నా' అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Chiranjeevi
Soldiers

More Telugu News