AP Legislative Council: శాసనమండలిలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం... సభ 15 నిమిషాలు వాయిదా
- వాడీవేడిగా మండలి సమావేశాలు
- బిల్లులు ప్రవేశపెట్టే అంశంలో భేదాభిప్రాయాలు
- అభ్యంతరాలు వ్యక్తం చేసిన టీడీపీ
ఏపీ శాసనమండలి సమావేశాలు రెండోరోజు వాడీవేడిగా సాగుతున్నాయి. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు ప్రవేశపెట్టాలని మంత్రులు పట్టుబట్టగా, టీడీపీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాంతో ఇరు పక్షాల మధ్య మండలిలో వాగ్వాదం నెలకొంది. ఏ బిల్లు ముందు ప్రవేశపెట్టాలన్న దానిపై ఓటింగ్ చేపట్టాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. సభ చివరిలో ద్రవ్య వినిమయ బిల్లు పెట్టాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఈ దశలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాదోపవాదాలు తీవ్రస్థాయికి చేరడంతో మండలిలో ఉద్రిక్తత ఏర్పడింది. దాంతో సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.