Sting Ray Fish: మచిలీపట్నం వద్ద మత్స్యకారుల వలకు 3 టన్నుల భారీ చేప
- మత్స్యకారుల వలలో టేకు చేప
- క్రేన్ తో బయటికి లాగిన వైనం
- వేలల్లో ధర పలికే టేకు చేప
సముద్రజలాలు అపార మత్స్యరాశికి ఆవాసాలు. సముద్ర గర్భంలో మరింత లోతుకు వెళ్లేకొద్దీ భిన్న రకాల చేపలు భారీ సైజులో కనిపిస్తుంటాయి. అప్పుడప్పుడు అవి మత్స్యకారుల వలలకు దొరుకుతుంటాయి. తాజాగా మచిలీపట్నం వద్ద గిలకలదిండి పోర్టులో కొందరు మత్స్యకారులు వేటకు వెళ్లగా, ఏకంగా మూడు టన్నుల బరువున్న అరుదైన చేప లభ్యమైంది. వలలు తెగిపోతాయన్న కారణంతో ఈ చేపను ఎంతో జాగ్రత్తగా తీరం వరకు తీసుకొచ్చి, ఆపై క్రేన్ సాయంతో ఒడ్డుపైకి చేర్చారు. దీన్ని 'టేకు చేప' అంటారని మత్స్యకారులు తెలిపారు. ఇది వేలల్లో ధర పలుకుతుందని పేర్కొన్నారు.