Atchannaidu: టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు మరోసారి ఆపరేషన్ చేసిన వైద్యులు

Another surgery for Atchannaidu at GGH
  • ఇటీవలే అచ్చెన్నకు పైల్స్ ఆపరేషన్
  • ఏసీబీ అరెస్టుతో రోడ్డు మార్గంలో విజయవాడ వరకు ప్రయాణం
  • విఫలమైన తొలి ఆపరేషన్
ఈఎస్ఐ కొనుగోళ్ల వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడ్ని ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, పైల్స్ కారణంగా ఆయన గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇప్పటికే ఓసారి శస్త్రచికిత్స చేయించుకున్నారు.

అయితే, ఆపరేషన్ జరిగిన తర్వాత ఏసీబీ ఆయన్ను అరెస్ట్ చేసి రోడ్డుమార్గంలో విజయవాడకు తరలించడంతో విశ్రాంతి తీసుకునే అవకాశం లేకపోయింది. దాంతో తొలిసారి చేసిన ఆపరేషన్ పూర్తిస్థాయిలో సఫలం కాకపోవడంతో తాజాగా మరోసారి ఆపరేషన్ చేశారు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్న గుంటూరు జీజీహెచ్ వైద్యులు ఈ మధ్యాహ్నం అచ్చెన్నాయుడుకు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.
Atchannaidu
Surgery
Piles
ACB
Arrest
ESI Scam

More Telugu News