India: చైనా-భారత్‌ ఘర్షణ: నలుగురు భారత జవాన్ల పరిస్థితి విషమం

4 Soldiers Critical After Ladakh Clash
  • ప్రకటించిన ఆర్మీ వర్గాలు 
  • ఘర్షణల్లో ఇప్పటికే 20 మంది భారత సైనికుల మృతి
  • భారత జవాన్లపై రాళ్లు విసిరి, రాడ్లతో చైనా సైనికుల దాడి
లడఖ్‌లోని సరిహద్దుల వద్ద భారత్‌, చైనా మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. భారత జవాన్లపై రాళ్లు విసిరి, రాడ్లతో చైనా సైనికులు దాడికి దిగిన ఘటనలో మరికొంత మంది భారత జవాన్లు గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇప్పటికే భారత ఆర్మీ నిర్ధారించిన విషయం తెలిసిందే. కాగా, సోమవారం రాత్రి తూర్పు లడఖ్‌ గాల్వన్‌ లోయలో భారత్-చైనా జవాన్లు ఘర్షణ పడిన ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.

India
China
army

More Telugu News