Leena: రాయపాటిని బెదిరించిన కేసులో హీరోయిన్ లీనా ... సీబీఐ గాలింపు!

Lookout Notice on Heroin Leena Who Cheated Rayapati
  • 'మద్రాస్ కేఫ్'లో హీరోయిన్ గా నటించిన లీనా
  • ప్రియుడితో కలిసి దందాలు
  • లుక్ అవుట్ నోటీసులు జారీ
తాను ఓ సీబీఐ అధికారినని చెప్పుకుంటూ దందాలు చేసి, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావును బ్లాక్ మెయిల్ చేసిన కేసులో 'రెడ్ చిల్లీస్', 'మద్రాస్ కేఫ్' తదితర చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన లీనా కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి మలయాళ నటి లీనాయేనని, ఆమె ప్రియుడు సుఖేశ్ చంద్రశేఖర్ కూడా నిందితుడేనని అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం లీనా పరారీలో ఉందని, ఆమెకోసం గాలిస్తున్నామని, లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశామని అధికారులు తెలిపారు. ఈ కేసులో లీనాకు అనుచరులైన మణివర్ధన్, సెల్వరామరాజు, అర్పిత్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. కాగా, గడచిన జనవరిలో లీనా అనుచరుడు రాయపాటి దగ్గరకు వచ్చి, తాను సీబీఐ అధికారినని చెప్పి డబ్బు డిమాండ్ చేయడంతో, ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే లీనాపై చాలా కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయని, ఆమెను అరెస్ట్ చేస్తే, మొత్తం కేసులోని చిక్కుముడులు వీడుతాయని పోలీసు అధికారులు అంటున్నారు. గతంలో తమిళనాడులో టీటీవీ దినకరన్ ను బెదిరించారన్న కేసు కూడా లీనాపై విచారణ దశలో ఉంది.
Leena
Rayapati Sambasiva Rao
CBI
Fruad

More Telugu News