Krishna District: కష్ణా జిల్లాలో ఉద్రిక్తత.. వైసీపీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణ

ruckus in krishna dist

  • వత్సవాయి మండలం చిట్యాలలో ఘటన
  • చెరువు మట్టి, గ్రావెల్ తవ్వకంలో ఘర్షణ
  • బీజేపీకి చెందిన శ్రీధర్‌రెడ్డికి గాయాలు
  • పోలీసుల బందోబస్తు  

కృష్ణా జిల్లాలోని వత్సవాయి మండలం చిట్యాలలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చెరువు మట్టి, గ్రావెల్ తవ్వకంలో వైసీపీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు దాడి చేసుకోవడం కలకలం రేపింది. బీజేపీకి చెందిన శ్రీధర్‌రెడ్డిపై వైసీపీకి చెందిన పలువురు దాడికి పాల్పడడంతో ఆయనకు గాయాలయ్యాయి.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన శ్రీధర్‌రెడ్డిని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో చిట్యాలలో ఎస్‌ఐ సోమేశ్వరరావు బందోబస్తు  ఏర్పాటు చేశారు.

Krishna District
YSRCP
BJP
  • Loading...

More Telugu News