Rajashekhar: గీతా ఆర్ట్స్ సినిమాలో డాక్టర్ రాజశేఖర్?

DR Rajashekhar in Geetha arts banner

  • చిరంజీవి ఫ్యామిలీతో విభేదించే రాజశేఖర్ 
  • మలయాళంలో వచ్చిన 'జోసెఫ్' సినిమా
  • తెలుగులో రీమేక్ చేస్తున్న గీతా ఆర్ట్స్
  • రిటైర్డ్ పోలీసాఫీసర్ పాత్రలో రాజశేఖర్

ఎప్పుడూ ఎవరూ ఊహించని కాంబినేషన్లు మన సినిమాలలోనే సెట్ అవుతూ వుంటాయి. అందుకు ఉదాహరణగా ప్రముఖ నటుడు డాక్టర్ రాజశేఖర్ చేయనున్న చిత్రం గురించే చెప్పుకోవచ్చు. చిరంజీవి ఫ్యామిలీతో చాలా విషయాలలో విభేదిస్తూ కనిపించే రాజశేఖర్, తాజాగా వాళ్ల కుటుంబానికి చెందిన ఓ బ్యానర్లో సినిమా చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది.

రెండేళ్ల క్రితం మలయాళంలో వచ్చిన మెడికల్ క్రైం థ్రిల్లర్ 'జోసెఫ్' అక్కడ మంచి ప్రేక్షకాదరణ పొందింది. దాంతో ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను అల్లు అరవింద్ ఫ్యామిలీకి దగ్గరి వాడైన బన్నీ వాసు తీసుకున్నారు. దీనిని 'గీతా ఆర్ట్స్ 2' బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో తెలుగులో పునర్నిర్మిస్తున్నారు. 'పలాస 1978' చిత్రంతో పేరుతెచ్చుకున్న దర్శకుడు కరుణ కుమార్ దీనికి దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ సినిమాలో కీలకమైన రిటైర్డ్ పోలీసాఫీసర్ పాత్రను రాజశేఖర్ పోషించనున్నట్టు తాజా సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Rajashekhar
Chiranjeevi
Allu Aravaind
Joseph
  • Loading...

More Telugu News