Somu Veerraju: చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు: సోము వీర్రాజు

Somu Veerraju terms Chandrababu a liar

  • చర్చనీయాంశంగా మారిన అచ్చెన్న అరెస్ట్
  • కులానికి, నేరానికి ఏమిటి సంబంధం అని ప్రశ్నించిన సోము
  • కుల పార్టీలను కూకటివేళ్లతో సహా పెకలిద్దాం అని పిలుపు

ఏపీలో కొన్నిరోజులుగా జరుగుతున్న అరెస్టుల పర్వం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు అని, కులానికి, నేరానికి ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు.

బీసీ అయినందునే అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేశారన్న టీడీపీ వ్యాఖ్యలపై స్పందిస్తూ, కుల పార్టీలను కూకటి వేళ్లతో సహా పెకలిద్దాం అంటూ పిలుపునిచ్చారు. చంద్రబాబు హయాంలో కులస్తులకు పెద్దపీట వేశారని, దాన్ని ఇప్పుడు జగన్ రెట్టింపు చేశాడని సోము వీర్రాజు విమర్శించారు. ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను పక్కనబెట్టి బీజేపీ-జనసేనకు అవకాశం ఇస్తే ఏపీ పురోగతి వైపు పయనిస్తుందని అన్నారు.

Somu Veerraju
Chandrababu
Liar
Atchannaidu
Arrest
Andhra Pradesh
Telugudesam
YSRCP
BJP
Janasena
  • Loading...

More Telugu News