Allu Arjun: నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోనంటూ అర్హ పరుగులు... బన్నీ చిరుకోపం!

Allu Arjun tells about her daughter

  • ఏడాదిగా ఇదే ప్రశ్న అడుగుతున్నానన్న అల్లు అర్జున్
  • ఇది తన 374వ ప్రయత్నమని వెల్లడి
  • వీడియో వైరల్

లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న అల్లు అర్జున్ తన పిల్లలతో బాగానే టైమ్ పాస్ చేస్తున్నాడు. ముఖ్యంగా, తన ముద్దుల కూతురు అర్హతో ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తున్నాడు. తాజాగా, అర్హతో ఫన్నీ మూమెంట్స్ కు సంబంధించి ఓ వీడియో పోస్టు చేశాడు.

 "నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా తల్లీ!" అంటూ ఎంతో అనునయంగా బన్నీ అడగ్గా... అర్హ ఏం మొహమాటం లేకుండా "నేను చేసుకోను" అంటూ చెప్పేసింది. బన్నీ మళ్లీ అడగ్గా, "నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోను" అంటూ మరింత స్పష్టంగా చెప్పి పరుగులు తీసింది. "ఏయ్ నిన్ను"... అంటూ అర్హపై బన్నీ చిరుకోపం ప్రదర్శించాడు.

ఏదేమైనా అర్హను పెళ్లి గురించి అడగడం ఇది 374వ సారి అని, ఈ ప్రయత్నం కూడా ఫెయిలైందని ఈ స్టయిలిష్ స్టార్ వెల్లడించాడు. ఏడాది కాలం నుంచి తాను అర్హను ఇదే ప్రశ్న అడుగుతున్నానని, నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా తల్లీ అని అడుగుతుంటే, చేసుకోనంటే చేసుకోను అని కరాఖండీగా చెబుతోందని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Allu Arjun
Arha
Marriage
Question
Video
  • Loading...

More Telugu News