Atchannaidu: విజయవాడలో టీడీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసు నిఘా.. రంగంలోకి ఇంటెలిజెన్స్, క్రైమ్ బ్రాంచ్!

Surveillance near TDP leaders in Vijayawada

  • అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన ఏసీబీ
  • రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు
  • అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవాడలో భద్రత

ఈఎస్ఐ కొనుగోళ్లలో 2014 నుంచి 2019 వరకు అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో ఆయన నివాసంలో అచ్చెన్నను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్నారు. అచ్చెన్న అరెస్ట్ తో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నాయి.

అచ్చెన్నను విజయవాడకు తీసుకొస్తున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నారు. టీడీపీ నేతల ఇంటి వద్ద గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. దేవినేని ఉమ, గద్దె రామ్మోహన్, బొండా ఉమ తదితరుల ఇళ్లవద్ద పోలీసులు మోహరించారు. నేతల కదలికలపై దృష్టి సారించారు. నగరంలో ఇంటెలిజెన్స్, క్రైం బ్రాంచ్ అధికారులు రంగంలోకి దిగారు.

  • Loading...

More Telugu News