raja singh: బీజేపీ తెలంగాణ నేతల ఇళ్ల వద్ద మోహరించిన పోలీసులు

police at bjp leaders home

  • ప్రగతి భవన్‌ ముట్టడికి బీజేపీ నేతల పిలుపు
  • ఎమ్మెల్సీ రామచందర్‌రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • లక్ష్మణ్, రాజాసింగ్ గృహ నిర్బంధం  

తెలంగాణలో ప్రజా సమస్యలపై హైదరాబాద్‌లోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ముట్టడికి రాష్ట్ర బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పలువురు నేతల ఇళ్ల ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు తెల్లవారుజామునుంచే బీజేపీ తెలంగాణ నేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు.

ఎమ్మెల్సీ రామచందర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మణ్, రాజాసింగ్‌లను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పోలీసులు తమను హౌస్‌ అరెస్టు చేయడం పట్ల వారు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారంపై చర్చించడానికి రావాలనుకుంటే సీఎం కేసీఆర్ ఇటీవల తమకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని వారు అన్నారు.

raja singh
BJP
Telangana
  • Loading...

More Telugu News