Anitha: విజయసాయిరెడ్డి సంస్కారం లేకుండా వ్యవహరిస్తున్నారు: టీడీపీ నేత అనిత

Vijayasai Reddy behaving indecently says Anitha

  • ఇలాంటి వ్యక్తిని రాజ్యసభకు పంపడం వైసీపీ అవివేకం
  • టీడీపీ వ్యవహారాల్లో ఆయనకెందుకు అంత ఆసక్తి?
  • టీడీపీ రాష్ట్ర నాయకుడిపై మహానాడులో చర్చే జరగలేదు

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారని టీడీపీ నాయకురాలు అనిత మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తిని పెద్దల సభ అయిన రాజ్యసభకు పంపడం వైసీపీ అవివేకమని చెప్పారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక అనేది తమ పార్టీ అంతర్గత వ్యవహారమని... ఈ విషయంలో విజయసాయిరెడ్డికి అంత ఆసక్తి ఎందుకని ప్రశ్నించారు.

టీడీపీకి సంబంధించిన ప్రతి అంశంలోకి విజయసాయిరెడ్డి తొంగి చూస్తుంటారని ఎద్దేవా చేశారు. టీడీపీ రాష్ట్ర నాయకుడి ఎంపికకు సంబంధించి టీడీపీ మహానాడులో చర్చే జరగలేదని చెప్పారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే విషయంపై చర్చ జరిగిందని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై చంద్రబాబుదే నిర్ణయమని చెప్పారు.

Anitha
Telugudesam
Vijayasai Reddy
YSRCP
  • Loading...

More Telugu News