Balakrishna: తాను పాడిన 'శివశంకరీ' పాటపై ట్రోలింగ్‌ పట్ల బాలకృష్ణ స్పందన

balakrishna about song

  • నా తండ్రి నాకు స్ఫూర్తి ప్రదాత
  • ఆయన నటించిన సినిమాలోని ఈ పాటంటే  చాలా ఇష్టం
  • ఈ పాట పాడాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నా
  • ఈ పాటను గొప్పగా పాడానని నేను అనడం లేదు

తన తండ్రి ఎన్టీఆర్ నటించిన 'జగదేకవీరుని కథ' సినిమాలోని 'శివశంకరీ' పాటను సినీనటుడు నందమూరి బాలకృష్ణ తన 60వ పుట్టినరోజు సందర్భంగా పాడి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సినీ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మతో పాటు పలువురు సెటైర్లు వేశారు. తన పాటపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ జరుగుతోన్న నేపథ్యంలో దీనిపై బాలకృష్ణ స్పందించారు.

తన తండ్రి తనకు స్ఫూర్తి ప్రదాత అని ఆయన చెప్పారు. ఆయన నటించిన ఆ సినిమాలోని ఈ పాటంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. తాను ఈ పాట పాడాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నానని, అందుకే తాను బాగా సాధన చేశానని తెలిపారు. ఈ పాటను గొప్పగా పాడానని తాను అనడం లేదని, ఓ ప్రయత్నం మాత్రం చేశానని తెలిపారు. తాను పాడగలిగినంత బాగా పాడానని వ్యాఖ్యానించారు.

Balakrishna
Tollywood
Facebook
  • Loading...

More Telugu News