Kerala: కరోనా నుంచి కోలుకుని.. ఆసుపత్రిలోనే ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Corona patient suicide in hospital

  • కేరళలోని తిరువనంతపురంలో ఘటన
  • ఆసుపత్రి నుంచి రెండుసార్లు పారిపోయిన రోగి
  • ఆసుపత్రిలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న వైనం

కరోనా వైరస్ బారినపడి చికిత్స అనంతరం కోలుకున్న 33 ఏళ్ల యువకుడు ఆసుపత్రిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళలోని తిరువనంతపురంలో జరిగిందీ ఘటన. కరోనా బారినపడిన యువకుడు ఇటీవల తిరువనంతపురం వైద్యకళాశాలలో చేరాడు. ఐసోలేషన్ గదిలో ఉంచి వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు.

ఈ క్రమంలో రెండుసార్లు ఆసుపత్రి నుంచి పారిపోయిన రోగి తన ఇంటికి చేరుకున్నాడు. అతడిని చూసిన గ్రామస్థులు తిరిగి అతడిని పోలీసులకు పట్టించారు. పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడికి రెండోసారి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్ అని వచ్చింది. దీంతో అతడిని డిశ్చార్జ్ చేయాలని అధికారులు నిర్ణయించి అతడు ఉంటున్న ఐసోలేషన్ గదికి వెళ్లి చూడగా సీలింగుకి వేలాడుతూ కనిపించాడు.

Kerala
thiruvananthapuram
Corona Virus
patient suicide
  • Loading...

More Telugu News