Ram Gopal Varma: 'మహాత్మా గాంధీ హత్య'పై సినిమా.. ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Verma new film on Gandhi and Godse

  • ఈ సారి ఏకంగా గాంధీని ఎంచుకున్న వర్మ
  • 'ది మ్యాన్ హూ కిల్డ్ గాంధీ' పేరుతో కొత్త చిత్రం
  • గాంధీ, గాడ్సేలతో పోస్టర్ విడుదల

సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ఉత్కంఠకు తెరతీశారు. ఇప్పటికే పలు వివాదాస్పద కథాంశాల ఆధారంగా చిత్రాలను తెరకెక్కించిన వర్మ... ఈసారి ఏకంగా మహాత్మాగాంధీని ఎంచుకున్నారు. 'ది మ్యాన్ హూ కిల్డ్ గాంధీ (గాంధీని హత్య చేసిన వ్యక్తి)' పేరుతో సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు.

అంతేకాదు, తన తాజా చిత్రానికి సంబంధించి పోస్టర్ ను కూడా ట్విట్టర్ లో విడుదల చేశారు. పోస్టర్ లో మహాత్మాగాంధీ, నాథూరామ్ గాడ్సేల ఫొటోలను కలిపి ఒకటిగా పెట్టారు. దీని గురించి వర్మ చెబుతూ, 'ఈ రెండు ఫొటోలను ఇలా ఒకటిగా విలీనం చేయడం వెనుక వున్న ఐడియా ఏమిటంటే, గాంధీని చంపడం అంటే గాడ్సే తనను తాను చంపుకోవడం అన్నమాట!; అంటూ పేర్కొన్నారు. ఇక ఈ చిత్రం ఎంత వివాదాస్పదం అవుతుందో వేచి చూడాలి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News