Thamanna: వాళ్ల మాటలు నేను పట్టించుకోను: తమన్నా

Thamanna clarifies why she is doing item songs

  • ఐటెం పాటల్లో మెరుస్తున్న ప్రముఖ తారలు 
  • పారితోషికం వల్లే తమన్నా చేస్తుందంటూ ప్రచారం  
  • డ్యాన్స్ అంటే ఇష్టమని వివరణ ఇచ్చిన తమ్మూ  

ఇటీవలి కాలంలో చాలా సినిమాలలో ప్రత్యేకంగా ఐటెం సాంగులు పెట్టడం.. వాటిలో పేరున్న తారలను నటింపజేయడం మన చూస్తున్నాం. ప్రముఖ హీరోయిన్లు సైతం ఈ పాటల్లో మనకు కనిపిస్తూ, వినోదాన్ని పంచుతున్నారు. మంచి పారితోషికం ఇవ్వడం.. పైగా మూడు నాలుగు రోజుల్లోనే పాట చిత్రీకరణ పూర్తికానుండడం వల్ల స్టార్ హీరోయిన్లు వీటికి మొగ్గుచూపుతున్నారు.

ఇలాంటి ఐటెం పాటలు చేసే నాయికలలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా వుంది. ఇప్పటికే చాలా సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ ప్రత్యేక గీతాల్లో నర్తించింది. దీంతో కేవలం డబ్బు కోసమే తమన్నా ఇలా ఐటెం పాటల్లో నటిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇదే విషయం ఈమె వద్ద ప్రస్తావిస్తే స్పందించింది.

'నాకు ఇలాంటి స్పెషల్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే, నాకు డ్యాన్స్ అంటే మహా ఇష్టం. ఇలాంటి పాటల్లో అయితే నా డ్యాన్స్ స్కిల్స్ ను ప్రేక్షకులకు మరింతగా చూపించగలుగుతాను. పైగా, ఇంతకు ముందు పనిచేసిన హీరోలతో మళ్లీ చేసే అవకాశం కూడా వీటి వల్ల వస్తుంది. అంతేకానీ, అందరూ అనుకుంటున్నట్టు వేరే కారణాల వల్ల మాత్రం కాదు. అయితే, ఇలాంటి వాళ్ల మాటలు నేను పట్టించుకోనులెండి' అని చెప్పింది తమన్నా.  


Thamanna
Item Song
Remuneration
  • Loading...

More Telugu News