Hyderabad: ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో పరిచయం.. నగ్నచిత్రాలు చూపి లక్షల్లో గుంజిన కిలాడీ!

Cyber Crime Police files a Case against a woman
  • పరిచయం ముదిరి నగ్న వీడియోలు మార్చుకునేంత వరకు వెళ్లిన వైనం
  • వాటిని చూపి ఏకంగా రూ. 3.63 లక్షలు గుంజేసిన కిలాడి
  • మరో రూ. 10 లక్షలు అడగడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు పరిచయమైన ఓ మాయలాడి అతడిని నిండా ముంచేసింది. అతడి నుంచి ఏకంగా రూ.3.63 లక్షలు కొట్టేసింది. చివరికి వేధింపులు శ్రుతి మించడంతో తట్టుకోలేని బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల కథనం ప్రకారం.. ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఇటీవల ఇన్‌స్టాగ్రాం ద్వారా ఓ యువతి పరిచయం అయింది. అది క్రమంగా స్నేహంగా మారి మరింత ముదిరింది. తర్వాత ఇద్దరూ పరస్పరం ఫొటోలను మార్చుకున్నారు.

ఆ తర్వాత మరింత ముందుకెళ్లి ఇద్దరూ నగ్న వీడియోలను షేర్ చేసుకున్నారు. అతడి నగ్నవీడియోలు ఆమె చేతిలో పడిన వెంటనే ఆమె తన ప్లాన్‌ను అమలు చేసింది. తనకు డబ్బులు ఇవ్వకుంటే తన దగ్గర ఉన్న నగ్న వీడియోలను కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆఫీసులోని ఉద్యోగులకు పంపుతానంటూ బెదిరించింది. దీంతో ఆమె చెప్పినట్టు చేయకతప్పలేదు. వారం రోజుల్లో ఏకంగా రూ. 3.63 లక్షలు ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. తాజాగా, మరో రూ.10 లక్షలు డిమాండ్ చేయడంతో విసిగిపోయిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాయలాడి కోసం గాలిస్తున్నారు.
Hyderabad
Software Engineer
woman
cyber crime

More Telugu News