India: ఇదేనా మీరు చెబుతున్న చైనా ఆక్రమణలోని ఇండియా?: ఫొటోలు పోస్ట్ చేసిన లడక్ ఎంపీ

- కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ
- కాంగ్రెస్ హయాంలోనే చైనా ఆక్రమణలు జరిగాయి
- ట్విట్టర్ లో సమాధానం ఇచ్చిన జామ్ యాంగ్ ట్రెన్సింగ్ నామ్ గోయల్
లడక్ లో భారత భూ భాగాన్ని చైనా ఆక్రమించిందా? అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వేళ, ఇదేనా మీరు చెబుతున్న చైనా ఆక్రమణలోని ఇండియా? అంటూ లడక్ ఎంపీ, బీజేపీ నేత జామ్ యాంగ్ ట్రెన్సింగ్ నామ్ గోయల్ కొన్ని చిత్రాలను ఈ ఉదయం పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన, ఇప్పటికైనా ఆయన, కాంగ్రెస్ పార్టీ తన సమాధానాన్ని స్వీకరించి, మరోసారి ప్రజలను తప్పుదారి పట్టించే పని చేయబోరని ఆశిస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. "ఇండియాలోని ప్రాంతాలను చైనా ఆక్రమించిందని రాహుల్ గాంధీ అంటున్నారు. అవును... అది ఇదే మీరూ చూడండి" అని నామ్ గోయల్ సెటైర్లు వేశారు.
