Ayyanna Patrudu: వైయస్ మరణానికి జగనే కారణమని బొత్స గతంలో ఆరోపించారు: అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu fires on Botsa

  • చంద్రబాబును విమర్శించే అర్హత బొత్సకు లేదు
  • మంత్రి పదవి ఇచ్చే సరికి జగన్ కు భజన చేస్తున్నారు
  • మద్యం మాఫియా చెలరేగిపోతోంది

ఏపీ కేబినెట్లో బొత్స సత్యనారాయణకు సీనియర్ అనే గౌరవం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం తరపున ఏది మాట్లాడాలన్నా, విపక్షాల విమర్శలకు సమాధానం ఇవ్వాలన్నా మొదట బొత్సనే మీడియా ముందుకు వస్తారు. అలాంటి బొత్సపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆరోపణలు చేశారు. తమ అధినేత చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత కూడా బొత్సకు లేదని ఆయన మండిపడ్డారు. వైయస్ మృతికి జగనే కారణమని గతంలో బొత్స ఆరోపించారని అన్నారు. ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చేసరికి జగన్ కు భజన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం మాఫియా చెలరేగిపోతోందని అన్నారు.

Ayyanna Patrudu
Telugudesam
Botsa Satyanarayana
YSRCP
Jagan
  • Loading...

More Telugu News