Rajinikanth: కరోనా పరిస్థితులపై స్పందించిన రజనీకాంత్

Rajinikanth writes open letter on corona situations
  • రజనీ బహిరంగ లేఖ
  • ముందు జాగ్రత్తలు ఎంతో కీలకమని వివరణ
  • సంక్షోభ సమయంలో సాయం చేయడం గొప్ప విషయమన్న రజనీ
దేశవ్యాప్తంగా కరోనా రక్కసి విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో తలైవా రజనీకాంత్ కల్లోల పరిస్థితులపై స్పందించారు. కరోనా మహమ్మారి నివారణలో ముందు జాగ్రత్తను మించింది లేదని అభిప్రాయపడ్డారు. శానిటైజేషన్, మాస్కులు, భౌతికదూరం కరోనా కట్టడిలో కీలకమైన అంశాలని రజనీ సూచించారు.

కరోనా కారణంగా ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారని, అలాంటి వాళ్లను ఆదుకునేందుకు చాలామంది ముందుకు రావడం హర్షణీయమని పేర్కొన్నారు. సంక్షోభ సమయంలో సాయం అందించడం చాలా గొప్ప విషయమని తలైవా ఓ సందేశంలో తెలిపారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖ రాశారు.
Rajinikanth
Corona Virus
Open Letter
Precautions
Help

More Telugu News