Kodandaram: కోర్టులను ఆశ్రయించాల్సి రావడానికి కారణం ఇదే: కోదండరామ్
- కరోనా పరీక్షా కేంద్రాలను పెంచండి
- ప్రభుత్వ తీరు దారుణంగా ఉంది
- వైద్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు
రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వ అధినేతల దృష్టికి తెచ్చే అవకాశం లేకుండా పోయిందని... అందుకే ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం వస్తోందని టీజేఎస్ అధినేత కోదండరామ్ అన్నారు. కరోనా విషయంలో హైకోర్టు సూచనలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని... సూచనలు అమలు చేయడం లేదని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరీక్షా కేంద్రాలను పెంచాలని డిమాండ్ చేశారు.
ప్రజల ఆరోగ్యానికి అతి తక్కువ నిధులు ఖర్చు చేస్తున్నారని కోదండరామ్ విమర్శించారు. ఓవైపు వైద్యులు కూడా కరోనా బారిన పడుతున్నారంటే... ప్రభుత్వ తీరు మాత్రం దారుణంగా ఉందని దుయ్యబట్టారు. హైకోర్టు తీర్పును అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని... దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లడం సమస్యను మరింత సంక్లిష్టం చేయడమే అవుతుందని చెప్పారు.