kona venkat: మా డైరెక్టర్ సేఫ్.. దయచేసి ఆమెపై ఇలాంటి ఊహాగానాలు ఆపండి: కోన వెంకట్

kona venkat tweet

  • కరణం మల్లేశ్వరి బయోపిక్ దర్శకురాలి పరిస్థితిపై కోన వివరణ
  • తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సంజనారెడ్డిపై ఇటీవల వార్తలు
  • వైరల్‌ ఫీవర్‌ రావడంతో చికిత్స తీసుకుంటున్నారన్న కోన

మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో ఒలింపిక్స్‌ మెడల్ సాధించిన కరణం మల్లేశ్వరి జీవితకథ ఆధారంగా సంజనా రెడ్డి దర్వకత్వంలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే, సంజనారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని,  హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమె ఐసీయూలో ఉన్నారని, వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారని కొందరు ప్రచారం చేశారు.

ఈ వార్తలపై సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. 'మా కరణం మల్లేశ్వరి బయోపిక్ దర్శకురాలు సంజనా రెడ్డి పూర్తిగా బాగున్నారు. కొన్ని రోజులుగా ఆమె ఇంట్లోనే ఉంటున్నారు. వైరల్‌ ఫీవర్‌ రావడంతో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. దయచేసి ఆమెపై వస్తోన్న ఊహాగానాలకు ఇక ముగింపు పలకాలని కోరుతున్నాను' అని కోన వెంకట్ అన్నారు. ఇటీవల ఆమెపై వచ్చిన వార్తలకు ఆయన చెక్‌ పెట్టారు.

kona venkat
Twitter
Tollywood
  • Loading...

More Telugu News