Vijay Sai Reddy: లోకేశ్ బాబు ఆవేశపడుతున్నారంటూ విజయసాయిరెడ్డి ట్వీట్.. కౌంటర్‌ ఇచ్చిన వర్ల రామయ్య

Saireddy Vs Varla

  • పార్టీ అధ్యక్షుడిగా లోకేశ్‌ను కాదని తండ్రి మరొకరిని ఎంపిక చేశారట
  • లోకేశ్‌లో ‘ఆవేదన తాలూకు ఉద్రేకం’ అన్న విజయసాయిరెడ్డి
  • వెటకారం పాలు జాస్తి అయిందంటూ వర్ల కౌంటర్
  • వెటకారం పెరిగితే, అవమానమే  మిగులుతుందని వ్యాఖ్య

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'లోకేశ్ బాబు ఆవేశం చూస్తుంటే ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టే కనిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా తనను కాదని తండ్రి మరొకరిని ఎంపిక చేయడం వల్ల తన్నుకొచ్చిన ‘ఆవేదన తాలూకు ఉద్రేకం’ బయటపడినట్టు అనిపిస్తోంది. పనికిరాడని సొంత తండ్రే సర్టిఫై చేస్తే తన ఫ్యూచర్ ఏమిటని కుంగిపోతున్నాడు పాపం' అని విమర్శించారు.
 
'హైదరాబాద్ లో ఉన్నా బాబు గారి మనసంతా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతోంది. మోదీ, అమిత్ షా గార్ల  కాళ్లు పట్టుకోవడం ఎలా అనే దానిపై వర్కవుట్ చేస్తున్నాడు. బీజేపీకి దగ్గర కావాలని తన మనుషులతో ఇప్పటికే అనిపించాడు. ఎల్లో మీడియా ఎంటరై అదొక చారిత్రక అవసరమన్నట్టు వరస కథనాలు వడ్డిస్తుంది' అని చెప్పారు.

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్ల రామయ్య కౌంటర్‌ ఇచ్చారు. 'విజయసాయిరెడ్డి గారు.. మీకు వెటకారం పాలు జాస్తి అయింది. వెటకారం పెరిగితే, అవమానమే  మిగిలేది. నిన్న మా లోకేశ్ ప్రెస్ మీట్ చూచి, మీరు కంగుతిన్నారు గదా? మీ నాయకుడు ఎప్పుడు బయటకు వచ్చి యిలాంటి ప్రెస్ మీట్ పెడతారని ఆలోచించి, గతి తప్పి, వెటకారం జోడిస్తున్నారు కదూ? లోకేశ్ మాటలు తూటాలే కదూ?' అని చురకలంటించారు.


Vijay Sai Reddy
YSRCP
Varla Ramaiah
Telugudesam
  • Loading...

More Telugu News