Vijay Sai Reddy: చంద్రబాబు, లోకేశ్‌కు చురకలంటించిన విజయసాయిరెడ్డి.. కౌంటర్‌ ఇచ్చిన కేశినేని నాని

Saireddy Vs Kesineni

  • లాక్‌డౌన్‌లో పెద్దబాబు, చిన్నబాబు సమయాన్ని కలిసి గడిపారు
  • లోకేశ్‌ పనికిరాడని తండ్రి తెలుసుకున్నాడన్న విజయసాయిరెడ్డి
  • ఏ1, ఏ2 లుగా జైలులో కలసి వున్నారన్న కేశినేని
  • దోచుకోవడానికే పనికొస్తామనే నిర్ణయానికి వచ్చారా?

టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్‌కి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చురకలంటించారు. 'లాక్‌డౌన్‌లో పెద్దబాబు, చిన్నబాబు చాలా సమయాన్ని కలిసి గడిపారు. తన కుమారుడు దేనికీ పనికిరాడని తండ్రి తెలుసుకున్నాడు. అలాగే, తన తండ్రి అన్నింటిలోనూ ప్రతికూలంగా వ్యవహరిస్తాడని తెలుసుకున్నాడు' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందిస్తూ.. 'ఏ1, ఏ2 లుగా సంవత్సర కాలం జైలులో కలసి వున్న మీరిద్దరూ ప్రజా ధనం దోచుకోవడానికి మాత్రమే పనికి వస్తాము అనే  నిర్ణయానికి వచ్చారా?' అని  కౌంటర్ ఇచ్చారు.

Vijay Sai Reddy
YSRCP
Kesineni Nani
Telugudesam
  • Loading...

More Telugu News