Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Pooja Hegde to play opposite Salman Khan

  • మరో హిందీ సినిమాలో పూజ హెగ్డే 
  • ఎన్నారై యువకుడిగా ఎన్టీఆర్
  • సీక్వెల్ చేయనున్న సూర్య

*  ప్రస్తుతం తెలుగులో బిజీగా వున్న కథానాయిక పూజ హెగ్డే బాలీవుడ్ ను కూడా వదలడం లేదు. ఈ క్రమంలో తాజాగా సల్మాన్ ఖాన్ సరసన ఓ చిత్రంలో నటించడానికి ఈ ముద్దుగుమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోపక్క, తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో దుల్ఖర్ సల్మాన్ సరసన నటించడానికి ఓకే చెప్పింది.
*  'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్టు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాగా, ఇందులో ఎన్టీఆర్ ఎన్నారై గా కనిపిస్తాడట. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు.
*  నాలుగేళ్ల క్రితం సూర్య కథానాయకుడుగా విక్రంకుమార్ దర్శకత్వంలో వచ్చిన సైంటిఫిక్ థ్రిల్లర్ '24' వినూత్న చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని గురించి దర్శకుడు విక్రంకుమార్ చెబుతూ, ప్రస్తుతం స్క్రిప్టు పని జరుగుతోందని చెప్పారు.

Pooja Hegde
Salman Khan
Jr NTR
Trivikram Srinivas
Surya
  • Loading...

More Telugu News