David Warner: తన టిక్ టాక్ వీడియోలన్నీ కలిపి 'రాములో రాములా' వీడియోను రూపొందించిన వార్నర్

David Warner creates a compilation video
  • టిక్ టాక్ వీడియోలతో వార్నర్ వినోదం
  • తెలుగు సినిమాల పట్ల మక్కువ చూపుతున్న ఆస్ట్రేలియన్ క్రికెటర్
  • అభిమానులను ఆకట్టుకుంటున్న వార్నర్ వీడియోలు
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు టాలీవుడ్ సినీ అభిమానులకు కూడా ఎంతో కావల్సినవాడయ్యాడు. లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన వార్నర్ క్రికెట్ ను మించిన పాప్యులారిటీ అందుకున్నాడంటే అందుకు కారణం టిక్ టాక్ వీడియోలే. తెలుగు సినిమాల హిట్ సాంగ్స్, డైలాగ్స్ తో టిక్ టాక్ వీడియోలు రూపొందిస్తున్న వార్నర్ అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. 'బుట్ట బొమ్మా', 'మైండ్ బ్లాక్' వంటి పాటలతో తనదైన శైలిలో అలరించిన వార్నర్... తాజాగా తన టిక్ టాక్ వీడియోల క్లిప్పింగ్స్ తో 'రాములో రాములా' అంటూ మరో వీడియో తయారుచేశాడు. ఇది కూడా అభిమానులకు వినోదం అందిస్తుందని వార్నర్ భావిస్తున్నాడు.

David Warner
TikTok
Video
Compilation

More Telugu News