Shriya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రాజమౌళి సినిమాలో ప్రత్యేక పాత్రలో శ్రియ
  • 'ఢీ' చిత్రానికి సీక్వెల్ చేస్తున్న శ్రీను వైట్ల
  • క్లైమాక్స్ కి వచ్చిన 'రొమాంటిక్' షూటింగ్ 
Shriya special role in RRR

*  రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ప్రముఖ నటి శ్రియ ప్రత్యేక పాత్రను పోషిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా తనే వెల్లడించింది. ఇందులో అజయ్ దేవగణ్ సరసన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తాను కనిపిస్తానని ఆమె చెప్పింది.
*  శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'ఢీ' చిత్రానికి ఇది సీక్వెల్ గా రూపొందుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు సమాచారం.
*  ఆకాశ్ పూరి హీరోగా అనిల్ పాదూరి దర్శకత్వంలో రూపొందుతున్న 'రొమాంటిక్' చిత్రం తదుపరి షెడ్యూలు త్వరలో హైదరాబాదులో మొదలవుతుంది. ఈ షెడ్యూలులో క్లైమాక్స్, ప్యాచ్ వర్క్ పూర్తిచేస్తారు. ఇందులో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

More Telugu News