Praneetha: కన్నడ నటుడు చిరంజీవి సర్జా మరణాన్ని తట్టుకోలేకున్నా... నా చేతులు వణుకుతున్నాయి: నటి ప్రణీత
- గుండెపోటుతో మరణించిన చిరంజీవి సర్జా
- 2013లో అతనితో కలిసి నటించిన ప్రణీత
- కుటుంబీకులకు సంతాపం
కన్నడ నటుడు చిరంజీవి సర్జా హఠాన్మరణం చెందగా, శాండల్ వుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కేవలం 39 సంవత్సరాల వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించగా, పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
దీనిపై తన ట్విట్టర్ ఖాతాలో స్పందించిన నటి ప్రణీత, "చిరు అకాల మరణ వార్త విని షాక్ నకు గురయ్యాను. నాకు నోట మాటలు రావడం లేదు. ఇది నేను టైప్ చేస్తుంటే నా చేతులు వణుకుతున్నాయి. అతను ఎంతో అద్భుతమైన నటుడే కాకుండా, చాలా మానవత్వాన్ని ప్రదర్శించే వ్యక్తి. ఆయన జీవితానికి చాలా అన్యాయం జరిగింది. చిరంజీవి భార్య మేఘనకు, అర్జున్ కు వారి కుటుంబీకులకు, సన్నిహితులకు ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి" అని ఓ ట్వీట్ పెట్టింది.
కాగా, చిరంజీవి సర్జాతో కలిసి ప్రణీత 'విజిల్' అనే సినిమాలో నటించింది. 2013లో ప్రశాంత్ రాజ్ దర్శకత్వంలో ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా కన్నడనాట మంచి విజయాన్ని అందుకుంది.