Schools: దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల పునఃప్రారంభంపై స్పష్టత ఇచ్చిన కేంద్రం

Centre to restart educational institutions after August fifteenth

  • కొన్నినెలలుగా దేశంలో లాక్ డౌన్
  • మార్చిలోనే మూతపడిన విద్యాసంస్థలు
  • ఇప్పట్లో తెరవొద్దంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు

కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దేశంలో విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. మార్చిలోనే స్కూళ్లకు, ఇతర విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చేశారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో విద్యాసంస్థల ప్రారంభం ఎప్పటి నుంచి అన్నది చర్చనీయాంశంగా మారింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పట్లో స్కూళ్లు, కాలేజీలు తెరవొద్దని తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వస్తుండగా, కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించింది.

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మాట్లాడుతూ, స్కూళ్లు, కాలేజీలు ఆగస్టు 15 తర్వాతే పునఃప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ లోపు అన్ని వార్షిక పరీక్షల ఫలితాలు వెల్లడించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. కాగా, ఏపీలో స్కూళ్లను ఆగస్టు 3న తెరవాలని సర్కారు నిర్ణయించింది.

  • Loading...

More Telugu News