rambha: భర్త, పిల్లలతో కలిసి 44వ పుట్టినరోజు జరుపుకుని ఫోటోలు పోస్ట్ చేసిన రంభ
![rambha with family](https://imgd.ap7am.com/thumbnail/cr-tn-bdb670f2204f.jpg)
- రంభకు కేక్ తినిపించిన భర్త
- లాక్‌డౌన్ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో వేడుక
- పిల్లలు, భర్తతో సంతోషంగా గడిపిన రంభ
సినీ నటి రంభ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పలు ఫొటోలు పోస్ట్ చేసింది. తన భర్త, వ్యాపారవేత్త ఇంద్రన్ కుమార్, తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆమె పుట్టినరోజు వేడుక జరుపుకుంది. తన 44వ బర్త్‌డే జరుపుకున్న ఆమెకు భర్త కేక్ తినిపించాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో తన పుట్టినరోజు వేడుకకు ఎవరినీ ఆహ్వానించకుండా ఆమె తన కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక చేసుకుంది. తన పిల్లలు, భర్తతో సంతోషంగా గడిపానని చెప్పింది. ఈ సందర్భంగా సెల్ఫీ ఫొటోలు కూడా తీసుకుని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
![](https://img.ap7am.com/froala-uploads/froala-24c2c6ac2c675612b75abb6aef1282b9e43e7793.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-5322db33b92a61644cd8199c5e3f751395d88da5.jpg)