poonam kaur: అందుకే ఇటువంటి అసభ్య వాఖ్యలు చేస్తారు: మీరా చోప్రా- ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ వివాదంపై పూనం కౌర్‌

poonam kaur tweets

  • నాపై కూడా అభిమానులు అటువంటి వ్యాఖ్యలే చేశారు
  • ఏ అభిమానిపై కూడా నేను ఫిర్యాదు చేయలేదు
  • కొందరు మధ్యవర్తులు తమ స్వలాభం కోసమే ఇలా చేస్తున్నారు
  • సినీ పరిశ్రమ రాజకీయ పార్టీలతో లింకై ఉంది

సినీ నటి మీరా చోప్రాపై జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ మండిపడుతోన్న విషయం తెలిసిందే. దీంతో సినీ నటి పూనమ్‌ కౌర్‌ తాజాగా పలు వ్యాఖ్యలు చేసింది. తనపై కూడా అభిమానులు అటువంటి వ్యాఖ్యలే చేశారని చెప్పింది. సరైన కారణం లేకుండా చాలా మంది తన గురించి తప్పుగా ప్రచారం చేశారని, తన గురించి అసభ్యంగా మాట్లాడారని ఆమె తెలిపింది.

అయినప్పటికీ తాను ఏ అభిమానిపై కూడా ఫిర్యాదు చేయలేదని ఆమె తెలిపింది. అసలు అభిమానులు అమాయకులని తాను నమ్ముతానని, కొందరు మధ్యవర్తులు తమ స్వలాభం కోసమే, ఫ్యాన్స్‌ను ఇటువంటి విషయాల్లో ప్రేరేపిస్తున్నారని ఆమె చెప్పింది. ఇతర వ్యక్తులతో తన ఫ్యాన్స్‌ అసభ్యంగా ప్రవర్తించాలని ఏ నటుడు కోరుకోడని తెలిపింది.

సినీ స్టార్‌ల జీవితంలో ట్రోలింగ్‌ ఒక భాగమని ఆమె చెప్పుకొచ్చింది. బాధితురాలిగా మార్చేందుకే వారు ట్రోలింగ్‌ చేస్తారని దీనిపై బాధపడాల్సిన అవసరం లేదని చెప్పింది. రాజకీయ ప్రయోజనాల్లో భాగంగా ఓ నటుడిపై బురదజల్లడం కోసం నఖిలీ ఖాతాలు సృష్టించి అభిమానులమని చెప్పుకుంటూ ఎవరైనా ఇటువంటి అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారా? అన్న విషయం గురించి మనకు తెలియదని ఆమె చెప్పింది.

సినీ పరిశ్రమ రాజకీయ పార్టీలతో లింకై ఉన్న విషయాన్ని అందరూ గ్రహించాలని ఆమె చెప్పింది. కొందరు రాజకీయ నేతలు రాక్షసులని, అటువంటి వారే ఇలాంటివి చేస్తారని ఆమె చెప్పింది.

poonam kaur
Tollywood
Social Media
  • Loading...

More Telugu News