dog: కుక్కను బైకుకు కట్టేసి కిలో మీటరు ఈడ్చుకెళ్లిన వైనం

dog dragged by chain

  • మ‌హారాష్ట్ర‌లో దారుణ ఘటన 
  • సామాజిక మాధ్యమాల్లో వీడియో
  • నిందితుల కోసం పోలీసుల గాలింపు

మ‌హారాష్ట్ర‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మానవత్వాన్ని మరచి మూగ జీవంపై హింసకు పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. ఓ కుక్క మెడ‌కు గొలుసు క‌ట్టి దాన్ని బైకుకు కట్టి, కిలో మీట‌రు వ‌ర‌కు దాన్ని ఈడ్చుకెళ్లారు. దీంతో కుక్క ఏమీ చేయలేక నరకయాతన అనుభవిస్తూ ఉండిపోయింది.

రోడ్డుపై చ‌ర్మం గీసుకుపోతుండ‌టంతో రక్తం కారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో కొందరు పోస్ట్ చేయడంతో ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ ఘ‌ట‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

యూపీలోనూ ఓ కుక్కను హింసించిన ఘటన బయటకు వచ్చింది. కొంద‌రు వ్యక్తులు ఓ కుక్కపై దారుణంగా దాడి చేయడంతో అది దెబ్బలకు తట్టుకోలేక అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయింది.  వారిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటీవల కేరళలో ఏనుగును కొందరు చంపేసిన ఘటనతో మూగజీవాలను వేధిస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ దేశ వ్యాప్తంగా వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే.

dog
Maharashtra
Crime News
  • Loading...

More Telugu News