Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం మృతి చెందాడంటూ ప్రముఖ మీడియా సంస్థ ప్రకటన

Dawood Ibrahim dies of corona virus announces NewsX

  • దావూద్ కరోనా బారిన పడ్డాడంటూ నిన్నటి నుంచి వార్తలు
  • ఈ వార్తలను ఖండించిన దావూద్ సోదరుడు అనీఫ్
  • దావూద్ చనిపోయాడని న్యూస్ ఎక్స్ ప్రకటన

ఇండియాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరోనా బారిన పడ్డాడనే వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని వార్తలు వచ్చాయి. కరాచీలోని మిలిటరీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్టు పాక్ మీడియా వెల్లడించింది.

అయితే దావూద్ సోదరుడు అనీఫ్ ఇబ్రహీం ఈ వార్తలను ఖండించాడు. దావూద్ కు కానీ, తమ కుటుంబంలోని ఇతర సభ్యులకు కానీ కరోనా పాజిటివ్ రాలేదని చెప్పాడు. అందరూ ఇంట్లోనే ఉన్నారని తెలిపాడు.

ఈ తరుణంలో ప్రముఖ మీడియా సంస్థ న్యూస్ ఎక్స్ సంచలన ప్రకటన చేసింది. కరోనా కారణంగా దావూద్ ఇబ్రహీం కరాచీలో మృతి చెందాడని ట్వీట్ చేసింది. అయితే దావూద్ మృతికి సంబంధించి మరే ఇతర అధికారిక ప్రకటన వెలువడలేదు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News