WHO: సడలింపులు ఇస్తున్నారు... ఏ సమయంలోనైనా కరోనా విరుచుకుపడవచ్చు: భారత్ కు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

WHO warns India about corona outbreak
  • భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు
  • ఇప్పటివరకు పరిస్థితి అదుపులోనే ఉందన్న డబ్ల్యూహెచ్ఓ
  • వైరస్ కట్టడి ప్రజల చేతుల్లోనే ఉందని వ్యాఖ్యలు
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, "వైరస్ విజృంభిస్తోంది" అనే స్థాయిలో మాత్రం పరిస్థితి లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అయితే, లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో, ఏ సమయంలోనైనా కరోనా వైరస్ విరుచుకుపడే అవకాశముందని హెచ్చరించింది.

తొలినాళ్లలో భారత్ తీసుకున్న చర్యలతో వైరస్ వ్యాప్తి కట్టడి జరిగిందని, కానీ దేశంలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, ఇలాంటి తరుణంలోనే కరోనా వైరస్ తీవ్ర రూపు దాల్చుతుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ మైకేల్ ర్యాన్ తెలిపారు.

భారత్ లో జనసాంద్రత ఎక్కువ అని, ఉపాధి కోసం ప్రజలు భారీ సంఖ్యలో కూలి పనులకు వెళుతుంటారని, వైరస్ వ్యాప్తి చెందడానికి ఇలాంటి పరిస్థితులే అత్యంత అనుకూలమని వివరించారు. లాక్ డౌన్ క్రమంగా ఎత్తివేస్తున్న తరుణంలో వైరస్ కట్టడి ప్రజల చేతుల్లోనే ఉందన్నారు.
WHO
Michael Ryan
India
Spreading
COVID-19

More Telugu News