Ravibabu: నువ్వు చెక్ చేయడం అయిపోయిందా... ఇప్పుడు నేను చెక్ చేస్తా!: రవిబాబు ఫన్నీ వీడియో

Ravibabu makes fun at a super market

  • కరోనా నేపథ్యంలో రవిబాబు మార్కు వినోదం
  • సూపర్ మార్కెట్ వద్ద రవిబాబుకు టెంపరేచర్ చెక్ చేసిన గార్డు
  • తిరిగి సెక్యూరిటీ గార్డుకు టెంపరేచర్ చెక్ చేసిన రవిబాబు

దర్శకుడు రవిబాబు తీసే సినిమాలే కాదు, బయట ఆయన వ్యవహార శైలి కూడా వినోదాత్మకంగా ఉంటుంది. కొన్నాళ్ల కిందట పందిపిల్లతో ఏటీఎం వద్దకు వచ్చి వార్తల్లోకెక్కారు. తాజాగా, కరోనా నేపథ్యంలో ఓ సూపర్ మార్కెట్ వద్ద తనదైనశైలిలో నవ్వులు పూయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సూపర్ మార్కెట్ మెయిన్ ఎంట్రన్స్ వద్ద రవిబాబు లోపలికి వెళుతుండగా సెక్యూరిటీ గార్డు థర్మల్ స్కానర్ తో రవిబాబును చెక్ చేయగా, "అయిపోయిందా... ఇప్పుడు నేను చెక్ చేస్తాను" అంటూ తన జేబులోంచి థర్మల్ స్కానర్ తీసిన రవిబాబు ఆ సెక్యూరిటీ గార్డుకు టెంపరేచర్ చెక్ చేయడం... ఆపై, "నీకేమీ లేదు, నువ్వు ఓకే" అని చెప్పి సూపర్ మార్కెట్లోకి సీరియస్ గా వెళ్లిపోవడం వీడియోలో చూడొచ్చు.

Ravibabu
Supermarket
Fun
Lockdown
Corona Virus
  • Loading...

More Telugu News