Crime News: కర్నూలులో దారుణం.. తమ్ముడి భార్యను దారుణంగా చంపేసిన వ్యక్తి

man killed sister in law

  • ఇంటి స్థల వివాదమే కారణం
  • తమ్ముడి భార్యతో గొడవ పెట్టుకున్న వ్యక్తి
  • కోపంతో ఊగిపోతూ గొడ్డలితో దాడి

సొంత తమ్ముడి భార్యను ఓ వ్యక్తి అతి దారుణంగా చంపేసిన ఘటన కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు మండల పరిధిలోని దామగట్ల గ్రామంలో చోటు చేసుకుంది. ఇంటి స్థలం విషయంలో అన్నదమ్ములు ఏసన్న, పుష్పరాజు తరుచూ గొడవ పడుతుండేవారు. ఇంటి స్థలం విషంయపైనే పుష్పరాజు భార్య శ్రీలేఖ (35)తో ఏసన్న మరోసారి గొడవ పెట్టుకున్నాడు.

ఆ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వివాదం పెరిగి ఆగ్రహంతో ఊగిపోతూ ఆమె మెడపై ఏసన్న గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో అక్కడే పడిపోయింది. ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్సులోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు ఈ  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Crime News
Kurnool District
  • Loading...

More Telugu News